జనగాం జిల్లాలో ఉద్యోగాలు.. మోడల్ స్కూళ్లలో 32 టీచర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి !

  జనగాం జిల్లాలో ఉద్యోగాలు.. మోడల్ స్కూళ్లలో 32 టీచర్ పోస్టులు.. వెంటనే అప్లై చేసుకోండి !

జనగాం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో (TGMS)  ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 32. 

విభాగాల వారీగా ఖాళీలు: ఆర్ట్ టీచర్ 8, యోగా టీచర్ 8, కంప్యూటర్ టీచర్ 8, లైబ్రేరియన్ 8. 

టీజీఎంఎస్: బచ్చన్నపేట, ఘన్‌పూర్ (స్టేషన్), జనగామ @ చౌడారం, కొడకండ్ల, రఘునాథపల్లి, జాఫర్‌గఢ్, లింగాల ఘన్‌పూర్, నర్మెట్ట తెలంగాణ మోడల్ స్కూళ్లల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నాయి. 

విద్యార్హతలు
ఆర్ట్ టీచర్:
అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్ (శిల్పకళ), కమర్షియల్ ఆర్ట్స్, ప్రింట్ మేకింగ్ లేదా యానిమేషన్‌లో  ఎంఎఫ్ఏ లేదా బీఎఫ్ఏ పూర్తిచేసి ఉండాలి. 

యోగా టీచర్: యోగాలో గ్రాడ్యుయేషన్, డిప్లొమా / యోగాలో డిగ్రీ / యోగా స్పెషలైజేషన్‌తో బీపీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. 

కంప్యూటర్ టీచర్: కంప్యూటర్ సైన్స్​లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

లైబ్రేరియన్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్​లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 2.

లాస్ట్ డేట్: నవంబర్ 6.

రాత పరీక్ష తేదీ: నవంబర్ 7. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ jangaon.telangana.gov.inను సందర్శించండి.
 

మరిన్ని వార్తలు