- మంత్రి పొంగులేటికి ఫిర్యాదు
ములుగు/గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్‌లో రెవెన్యూ అధికారులు చేపట్టిన భూసర్వేపై గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. సోమవారం తహసీల్దార్ సరిత, రెవెన్యూ సిబ్బంది సర్వేకు రాగా అడ్డుకున్నారు. ముందుగా గ్రామ సరిహద్దులు నిర్ధారించిన తర్వాతే సర్వే చేయాలని డిమాండ్ చేశారు. రెండు మూడు రోజులుగా ఈ విషయాన్ని అధికారులకు చెబుతున్నా పట్టించుకోకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు.
ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే సర్వే నిలిపివేస్తామని అధికారులు తెలిపారు. దీంతో సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తులు హైదరాబాద్‌కు వెళ్లారు. వారు వెళ్లిన తర్వాత అధికారులు సర్వేను కొనసాగించడం గమనార్హం.
