టెక్నాలజీకి అనుగుణంగా మారాలి ..మా ప్రభుత్వం వచ్చాక ప్రతి శాఖలో ఏఐని ప్రోత్సహిస్తం: కేటీఆర్  

టెక్నాలజీకి అనుగుణంగా మారాలి ..మా ప్రభుత్వం వచ్చాక ప్రతి శాఖలో ఏఐని ప్రోత్సహిస్తం: కేటీఆర్  
  • నానక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలో ‘క్యాంపస్ హబ్ ఏఐ’ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లాంచ్  
  • పల్లెలకు చెందిన నలుగురు యువకులు ఏఐ టూల్ తేవడం గర్వకారణం
  • హైదరాబాదే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టొచ్చని వెల్లడి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూతం కాదని, అది మానవాళికి దూత లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచమంతా ఏఐ యుగం నడుస్తున్నదని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనమూ మారాలని సూచించారు. సోమవారం నానక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలోని షెరటాన్ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాంపస్ హబ్ ఏఐ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన నలుగురు యువకులు  వినూత్న ఆలోచనతో క్యాంపస్ హబ్ ఏఐ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో మరో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆ వెంటనే అన్ని ప్రభుత్వ శాఖలను ఏఐ టెక్నాలజీతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.  

రాబోయే కాలమంతా ఏఐదే

ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫోన్ల నుంచి మొదలైన ప్రయాణం.. స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ల మీదుగా ఇప్పుడు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ కార్లు రోడ్లపై తిరిగే స్థాయికి సాంకేతికత దూసుకుపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. నేటి విద్యావ్యవస్థలో టెక్నాలజీ అత్యంత కీలకపాత్ర పోషిస్తోందన్నారు. రాబోయే కాలమంతా ఏఐదే హవా ఉంటుందని, అయితే ఎక్కడ అవసరమో అక్కడే దీన్ని సమర్థంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏఐని దుర్వినియోగం చేయవద్దని సూచించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏఐని ప్రోత్సహించాలని కోరారు. ఐటీ కంపెనీల ఏర్పాటు కేవలం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి మహానగరాలకే పరిమితం కావాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అద్భుతంగా ఐటీ కంపెనీలను నెలకొల్పవచ్చని చెప్పారు. పరకాలలో రాకేష్ అనే యువకుడు ఐటీ కంపెనీని ప్రారంభించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారని గుర్తు చేశారు.