గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ తయారీపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెంచండి : రెడ్‌‌‌‌‌‌‌‌కో వీసీఎండీ జితేశ్ వి.పాటిల్‌‌‌‌‌‌‌‌ 

గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ తయారీపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెంచండి : రెడ్‌‌‌‌‌‌‌‌కో వీసీఎండీ జితేశ్ వి.పాటిల్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్‌‌‌‌‌‌‌‌ ఎనర్జీ ఉత్పత్తిపై దృష్టి పెంచాలని రెడ్‌‌‌‌‌‌‌‌కో వైస్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ మేనేజింగ్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జితేశ్​వి.పాటిల్‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. పీఎం కుసుం, రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌, మోడల్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ విలేజ్‌‌‌‌‌‌‌‌, వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు పథకాలను వేగంగా అమలు చేయాలని సూచించారు.

సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని రెడ్‌‌‌‌‌‌‌‌కో కార్యాలయం నుంచి జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. గృహజ్యోతి పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇళ్లపై రూఫ్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటును విస్తరించాలని చెప్పారు. వీటి ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించి, ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్‌‌‌‌‌‌‌‌, పీఎం కుసుం లక్ష్యాల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.