యూత్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఖుష్బుకు పతకం ఖాయం

యూత్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఖుష్బుకు పతకం ఖాయం

డాకర్‌‌‌‌ (సెనెగల్‌‌‌‌): యూత్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియా జూడోకాకు పతకం ఖాయమైంది. విమెన్స్‌‌‌‌ 63 కేజీల విభాగంలో ఖుష్బు రాజక్‌‌‌‌భాయ్‌‌‌‌ దర్జాదా ఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లి కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన సెమీస్‌‌‌‌లో ఖుష్బు ‘ఇప్పోన్‌‌‌‌’తో డౌనియా బెర్రహౌల్‌‌‌‌ (అల్జీరియా)పై గెలిచింది. దాంతో టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌కు అర్హత సాధించిన రెండో ఇండియన్‌‌‌‌ జూడోకాగా రికార్డులకెక్కింది. 

ఫైనల్లో జొలినా రెయిన్‌‌‌‌హోల్డ్‌‌‌‌ (జర్మనీ)పై గెలిస్తే స్వర్ణం నెగ్గిన తొలి ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌గా చరిత్ర సృష్టిస్తుంది. ఇంతకుముందు 2018లో తంగ్జం తబాబి దేవి (44 కేజీ) సిల్వర్‌‌‌‌ గెలిచింది. ఖుష్బు స్వర్ణం సాధిస్తే.. 2018లో పసిడి గెలిచిన మను భాకర్‌‌‌‌, సౌరభ్‌‌‌‌ చౌదరి (షూటింగ్‌‌‌‌), జెరెమీ లాల్‌‌‌‌రినుగా (మెన్స్‌‌‌‌ 62 కేజీ వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌) సరసన చోటు సంపాదిస్తుంది. మరోవైపు విమెన్స్‌‌‌‌ 100 మీటర్ల ఫ్రీస్టైల్‌‌‌‌ రేసులో ధినిధి దేశింగు ఫైనల్‌‌‌‌కు అర్హత సాధించింది. యూత్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ చేరిన తొలి ఇండియా విమెన్‌‌‌‌ స్విమ్మర్‌‌‌‌గా నిలిచింది.