జీఎస్‌‌‌‌ఎంఏ బోర్డు చైర్మన్‌‌‌‌గా గోపాల్ విఠల్

జీఎస్‌‌‌‌ఎంఏ బోర్డు చైర్మన్‌‌‌‌గా గోపాల్ విఠల్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రపంచ మొబైల్ ఆపరేటర్ల సమాఖ్య (జీఎస్‌‌‌‌ఎంఏ) బోర్డు చైర్మన్‌‌‌‌గా భారతీ ఎయిర్‌‌‌‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన 2027 జనవరి నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 2025 నుంచి చైర్మన్‌‌‌‌గా ఉన్న ఆయన గత పదేళ్లుగా ఈ బోర్డులో కొనసాగుతున్నారు. ఏఐ సాంకేతికత వినియోగం, కస్టమర్లను సైబర్ మోసాల నుంచి రక్షించడం, టెలికాం పరిశ్రమ భద్రత, ఆధునిక నెట్‌‌‌‌వర్క్ విస్తరణే తమ ప్రధాన ప్రాధాన్యాలని విఠల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.