బాధ్యతలు తీసుకున్న జిటో కొత్త కార్యవర్గం  

బాధ్యతలు తీసుకున్న జిటో కొత్త కార్యవర్గం  

హైదరాబాద్​, వెలుగు: జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జిటో) హైదరాబాద్ చాప్టర్ నూతన కార్యవర్గం అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. సంస్థ చైర్మన్‌‌‌‌గా బీఎల్ భండారి ఎన్నికయ్యారు. రానున్న రెండేళ్ల పాటు ఈ కొత్త బృందం సేవలు అందించనుంది. వ్యాపార నెట్‌‌‌‌వర్కింగ్, ఆర్థిక సాధికారత, సామాజిక సేవలను ఈ కార్యవర్గం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కార్పస్ ఫండ్‌‌‌‌తో ఈ సంస్థ దేశంలోనే ప్రముఖ వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు సంజయ్ డాంగి, గణపతిజీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా హాస్టళ్ల నిర్మాణానికి జిటో అపెక్స్ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది.