నిమ్స్‌‌‌‌‌‌‌‌లో సర్జరీ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌లో గోల్‌‌‌‌‌‌‌‌ మాల్ 

నిమ్స్‌‌‌‌‌‌‌‌లో సర్జరీ మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌లో గోల్‌‌‌‌‌‌‌‌ మాల్ 
  • సప్లయర్ నుంచి నేరుగా ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే మందులు, మెటీరియల్‌‌‌‌‌‌‌‌
  • తాజా తనిఖీల్లో గుర్తించిన ఏసీబీ
  • స్టోర్స్ రికార్డుల పరిశీలన.. ఆరుగురి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిమ్స్‌‌‌‌‌‌‌‌లో అక్రమాలు, అవకతవకలపై ఏసీబీ చేస్తున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్జికల్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్, ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటి వినియోగించే క్రమంలో భారీ గోల్​మాల్ జరుగుతున్నట్లు తాజాగా బయటపడింది. నిమ్స్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఏసీబీ మరోసారి సోదాలు నిర్వహించింది. ఇద్దరు ఏసీబీ డీఎస్పీలతో కూడిన ఏసీబీ బృందం సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్టోర్స్‌‌‌‌‌‌‌‌ రికార్డులను పరిశీలిస్తున్నది.

పేషెంట్ల రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి ఇన్‌‌‌‌‌‌‌‌ పేషెంట్ల అడ్మిషన్‌‌‌‌‌‌‌‌, బెడ్స్‌‌‌‌‌‌‌‌ కేటాయింపులు, ఫార్మా ఏజెన్సీల నుంచి మందులు, సర్జికల్ పరికరాలు సప్లయ్‌‌‌‌‌‌‌‌, వినియోగంపై పూర్తి వివరాలు రాబడుతోంది. సప్లయర్​నుంచి సర్జికల్​మెటీరియల్‌‌‌‌‌‌‌‌, మందులు నేరుగా ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజానికి సర్జికల్ మెటీరియల్, మందులు మొదట సప్లయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి స్టోర్స్‌‌‌‌‌‌‌‌కి రావాలి. అక్కడ రికార్డు చేశాక డాక్టర్ల సిఫార్సు మేరకు ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించాలి.

ఇలాగైతే వచ్చిన మెటీరియల్​ఎంత? వాడింది ఎంత? మిగిలిన స్టాక్ ఎంత? అనే లెక్కలు పక్కాగా ఉంటాయి. కానీ ముందు ఆపరేషన్ థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టాక్ పంపి, మిగిలిన మెటీరియల్, మందులు తిరిగి స్టోర్స్‌‌‌‌‌‌‌‌కు పంపుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే రికార్డులు తారుమారు అయినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌, సర్జికల్ స్టోర్స్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది నుంచి ఏసీబీ పూర్తి సమాచారం రాబడుతున్నది.

ఏటా సర్జరీలకు వినియోగించే ఇంజెక్షన్లు సహా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు, పేషెంట్లు ధరించే మాస్కులు, సర్జికల్ గౌన్స్, స్క్రబ్స్‌‌‌‌‌‌‌‌, గ్లౌసులు సహా దాదాపు ప్రతి మెటీరియల్‌‌‌‌‌‌‌‌ గురించి వివరాలు సేకరిస్తున్నది. ఈ మేరకు నిమ్స్‌‌‌‌‌‌‌‌లో గత 20 ఏండ్లుగా స్టోర్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌లుగా పనిచేసిన నగేశ్, అయ్యంగార్‌‌‌‌‌‌‌‌ సహా మరో నలుగురిని విచారించిట్లు తెలిసింది. ప్రధానంగా సర్జికల్‌‌‌‌‌‌‌‌ స్టోర్స్‌‌‌‌‌‌‌‌కు ఏజెన్సీల నుంచి సప్లయ్‌‌‌‌‌‌‌‌ అవుతున్న మందులు, ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లకు అవసరమైన పరికరాలు దారిమళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం.