ఒమర్‌‌‌‌–-నిధి పెళ్లి షరియా ప్రకారం చెల్లదు! : మౌలానా షహాబుద్దీన్‌‌‌‌ వ్యాఖ్య

ఒమర్‌‌‌‌–-నిధి పెళ్లి షరియా ప్రకారం చెల్లదు! : మౌలానా షహాబుద్దీన్‌‌‌‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌‌‌‌ సీఎం ఒమర్‌‌‌‌ అబ్దుల్లా, జర్నలిస్ట్‌‌‌‌ నిధి రజ్దాన్‌‌‌‌ వివాహంపై మతపరమైన వివాదం మొదలైంది. వీరిద్దరి పెళ్లి షరియా ప్రకారం అనుమతించదగినది కాదని ఆల్‌‌‌‌ ఇండియా ముస్లిం జమాత్‌‌‌‌ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్‌‌‌‌ రజ్వీ బరేల్వీ పేర్కొన్నారు. ఇస్లామిక్‌‌‌‌ నిబంధనల ప్రకారం వివాహానికి ఇద్దరూ ముస్లింలై ఉండాలన్నారు. 

ఒమర్‌‌‌‌ ముస్లిం కాగా.. నిధి ఇస్లాం మతాన్ని స్వీకరించలేదని, అందుకే ఈ వివాహం షరియా ప్రకారం చెల్లదన్నారు.  నిధి ఇస్లాం స్వీకరించేలా ఒమర్‌‌‌‌ చూసుకోవాల్సిందని వ్యాఖ్యా నించారు. అప్పుడు వారి కలయిక ‘నజాయాజ్‌‌‌‌’ (అనుమతించదగనిది)గా అభివర్ణించారు.