కేదార్‌‌‌‌ తాల్‌‌‌‌ లో హిమపాతం..8 మంది గల్లంతు

కేదార్‌‌‌‌ తాల్‌‌‌‌ లో హిమపాతం..8 మంది గల్లంతు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌‌‌‌ ఉత్తరకాశీ జిల్లాలోని ప్రసిద్ధ కేదార్‌‌‌‌తాల్ ట్రెక్కింగ్ మార్గంలో  హిమపాతం (అవలాంచ్‌‌‌‌) సంభవించడంతో ఎనిమిది మంది ట్రెక్కర్లు గల్లంతయ్యారు. మూడో రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నా బాధితుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. అక్టోబర్ 27న గంగోత్రి నుంచి మొత్తం 12 మంది సభ్యులతో కూడిన బృందం ట్రెక్కింగ్​కు బయలుదేరింది. 

బృందంలో ఏడుగురు ట్రెక్కర్లు, గైడ్, వంటమనిషి, ముగ్గురు పోర్టర్లు ఉన్నారు. అక్టోబర్ 29 నాటికి వీరంతా యాత్ర ముగించుకుని తిరిగి రావాల్సి ఉంది. కానీ, ఇప్పటిదాకా నలుగురు మాత్రమే సురక్షితంగా వెనక్కి రాగలిగారని అధికారులు సోమవారం వెల్లడించారు. మిగిలిన 8 మంది భోజ్‌‌‌‌ఖడక్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయారని తెలిపారు.