షారుఖ్ ఖాన్ నుంచి రాబోతున్న చిత్రం ‘కింగ్’. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సోమవారం షారుఖ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘తూ మిల్ జాయే’ అంటూ సాగే ఈ పాటను సచిన్–జిగర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి పాడారు. ఇంటర్నేషనల్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ ఇంగ్లీష్ ర్యాప్‌తో ఈ పాటలో కనిపించడం విశేషం.
కుమార్ సాహిత్యం సమకూర్చారు. పీయూష్–షాజియా కొరియోగ్రఫీ చేశారు. “నేను హంతకుడిని కాదు.. ప్రేమికుడిని” అని షారుఖ్ చెప్పే డైలాగ్‌తో ఈ పాట మొదలైంది. మొదటిసారి వినగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ పాటలో షారుఖ్, దీపికా పదుకొణే మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ ఇంప్రెస్ చేశాయి. మరోవైపు యాక్షన్ సీన్స్‌ను బ్లెండ్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్’ తర్వాత షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.
