పర్యాటక రంగానికి పెద్దపీట: మంత్రి సీతక్క

పర్యాటక రంగానికి పెద్దపీట: మంత్రి సీతక్క

ములుగు జిల్లా జంగాల పల్లి గుట్టను ‘టేబుల్ మౌంటెన్’ తరహాలో అభివృద్ధికి సన్నాహాలు
 రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్ ​డెవలప్ మెంట్​​
 గ్రామాల్లో పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
 
వెంకటాపూర్(ములుగు ), వెలుగు :  ములుగు జిల్లాలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని,  చారిత్రక, సహజ వనరులను పరిరక్షిస్తూ ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నూతన కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో వికాస్ మీనాలతో కలిపి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులు, పర్యాటక అభివృద్ధి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గ్రామీణ ఉపాధి, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, కొనుగోళ్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  

కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమన్వయంతో జిల్లా స్థాయి కమిటీ ద్వారా అనుమతుల ప్రక్రియను చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, ఐటీడీఏ ద్వారా ఇప్పటికే మంజూరైన రహదారి పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా ములుగు జిల్లాలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు జిల్లా అభివృద్ధిపై సమీక్షించినట్లు తెలిపారు. జంగాల పల్లి గుట్టకు దక్షిణాఫ్రికాలోని కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాము సందర్శించిన టేబుల్ మౌంటెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలిన ఆకృతి ఉందని వివరించారు.

 గుట్టపై నుంచి ఒకవైపు లక్నవరం, మరోవైపు రామప్ప కనిపించే మంచి వ్యూ పాయింట్ ఉన్నందున పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇతర నిపుణులను ఆహ్వానించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రామప్పలో రూ.13 కోట్లతో ఐలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తున్నామని,  ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. జిల్లాలో వెలుగులోకి వస్తున్న గుహలు, గుట్టలు, కోటలు, పురాతన ఆలయాలను పరిరక్షిస్తామని పేర్కొన్నారు. పాత కట్టడాలకు కష్టంకలగకుండా కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పారు. 

గ్రామాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. యాప్ ద్వారా ఏ గ్రామానికి ఏ పనులు మంజూరయ్యాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే వివరాలను ఫొటోలతో సహా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరిశీలించే అవకాశం ఉంటుందని, దీనివల్ల తనతోపాటు సంబంధిత అధికారులు నేరుగా పనులను సమీక్షించడానికి వీలవుతుందని వివరించారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో పరిస్థితులు, కరువును ఎదుర్కొనేందుకు ఉపాధి హామీ పథకం కింద 375 రకాల పనులను చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు.

 పని కోరిన ప్రతి ఒక్కరికీ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులిచ్చి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పనుల సమన్వయానికి ఎంపీడీవో చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మండల స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జి.సంపత్ రావు, టూరిజం నోడల్ అధికారి ధర్మ నాయక్, డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ, సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.