ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(ఐఫా) 2026 విజేతలను శుక్రవారం అనౌన్స్ చేశారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేర్వేరుగా అవార్డులను ప్రకటించారు. రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్'కు అవార్డుల పంట పండిండి. టైటిల్ రోల్‌లో మెప్పించిన రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డును కైవసం చేసుకున్నాడు. అదే చిత్రంలో విలన్‌గా నటించిన అక్షయ్ ఖన్నా బెస్ట్ విలన్‌గా, కీలకపాత్ర పోషించిన సంజయ్ దత్ సహాయ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడు సహా మొత్తం 12 విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను గెలుచుకుంది.
‘సైయారా’ చిత్రానికి ఉత్తమ నటిగా అనీత్ పడ్డా నిలిచింది. అలాగే బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డెబ్యూ మూవీ హీరో సహా మరికొన్ని విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు దక్కాయి. ఇక ఉత్తమ తొలి సినిమా హీరోయిన్‌గా రవీనా టాంటన్ కూతురు రషా తడానీ నిలిచింది. ఓటీటీ కేటగిరీలో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ 5 అవార్డులతో టాప్‌లో నిలిచింది. ‘పాతాల్ లోక్ 2’ సిరీస్‌కు మూడు అవార్డులు దక్కాయి. ఇక ఓటీటీ సినిమా కేటగిరీలో ‘బారాముల్లా’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. బెస్ట్ యాక్టర్ (ఓటీటీ)గా ‘స్టోలెన్’ సినిమాకు అభిషేక్ బెనర్జీ అవార్డును గెలుచుకున్నాడు.
