పదేళ్ల తర్వాత శింబుతో నయనతార

పదేళ్ల తర్వాత శింబుతో నయనతార

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్లలో శింబు, నయనతార జోడీ కూడా ఒకటి. దాదాపు పదేళ్ల తర్వాత వీరి జోడీ  స్ర్కీన్‌‌‌‌పై కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ‘డ్యూడ్’ ఫేమ్  కీర్తీశ్వరన్ దర్శకత్వంలో  శింబు హీరోగా ఓ  చిత్రానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్రంలో  హీరోయిన్‌‌‌‌గా నయనతారను సెలెక్ట్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చర్చలు జరపగా.. నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.  

శింబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడని,  నయనతార కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేయనుందని టాక్.  ఆమె కోసం యాక్షన్ సన్నివేశాలను కూడా  ప్లాన్ చేస్తున్నారట. గతంలో వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో పాటు కొన్నేళ్లు రిలేషన్‌‌‌‌లో ఉన్నారు. అయితే బ్రేకప్‌‌‌‌ తర్వాత శింబుతో కలిసి నటించడానికి నయనతార ఆసక్తి చూపించలేదు. దీంతో వీరిమధ్య మరింత గ్యాప్ ఏర్పడింది. 

కొన్నేళ్ల తర్వాత మనసు మార్చుకుని ‘ఇదు నమ్మ ఆలు’ అనే చిత్రంలో నటించినా ఇద్దరి మధ్య ఉన్న గొడవల ప్రభావం షూటింగ్‌‌‌‌పై పడింది. నిర్మాణపరమైన సమస్యలు ఎదుర్కోవడంతో పాటు  సినిమా పరాజయం పాలైంది.  తన పెళ్లి డాక్యుమెంటరీలోనూ శింబుపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన నయన్..  ఇప్పుడు అతనితో కలిసి నటించనుండటం విశేషం.  డిసెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న  ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నాడు.