లైసెన్సులు లేకుండా వ్యాపారాలు..  తూకాల్లోనూ మోసాలు

లైసెన్సులు లేకుండా వ్యాపారాలు..  తూకాల్లోనూ మోసాలు
  •     బియ్యం షాపుల్లో సివిల్​సప్లయీస్​తనిఖీలు
  •     పలువురు వ్యాపారులపై కేసులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో బియ్యం వ్యాపార సంస్థల్లో పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మలక్‌‌పేట, మంగళ్‌‌హాట్, కృష్ణానగర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 8 బియ్యం షాపులు రూల్స్​ఉల్లంఘించినట్లు గుర్తించారు. కొందరు వ్యాపారులు లైసెన్సులు లేకుండా షాపులు నడుపుతున్నారని, జీఎస్టీ లేదని, ధరలు, నిల్వల వివరాలు  బోర్డులపై ప్రదర్శించడం లేదని గుర్తించారు.

ధ్రువీకరించిన వెయింగ్​మెషీన్స్​వాడకపోవడం, బియ్యం బస్తాల తూకాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై పలు షాపులపై కేసులు నమోదు చేశారు. బియ్యం కొనుగోలు సమయంలో అధిక ధరలు వసూలు చేసినా, తూకంలో తేడాలు గుర్తించినా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులను సూచించారు. తనిఖీల్లో సీవీఈవో శశిధర్ రాజు, హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, లీగల్ మెట్రాలజీ ఇన్‌‌స్పెక్టర్ శివానంద్‌‌తో పాటు సంబంధిత ఏసీఎస్‌‌వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.