తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్‌‌ఐ స్కానింగ్ ..రెండేండ్లలో అన్ని  జీజీహెచ్‌‌లలో ఫ్రీగా సేవలు

తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్‌‌ఐ స్కానింగ్ ..రెండేండ్లలో అన్ని  జీజీహెచ్‌‌లలో ఫ్రీగా సేవలు

హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్)లలో పీపీపీ విధానంలో ఎంఆర్‌‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.  శుక్రవారం కోఠిలోని టీజీఎంఎస్‌‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  తొలుత మహబూబ్‌‌నగర్ జీజీహెచ్‌‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.  

పేషెంట్లకు ఎంఆర్‌‌ఐ స్కానింగ్ పరీక్షలు పూర్తిగా ఫ్రీగా అందిస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌‌, టిమ్స్‌‌, ఎంఎన్‌‌జే క్యాన్సర్ హాస్పిటల్‌‌తో పాటు వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌‌, భూపాలపల్లి జీజీహెచ్‌‌లలో మాత్రమే ఎంఆర్‌‌ఐ సేవలున్నాయి. కరీంనగర్‌‌, ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల దవాఖాన్లలో ఈ సదుపాయం లేదు. పీపీపీ విధానంతో యంత్రాల కొనుగోలు, నిర్వహణలో ప్రభుత్వానికి 20 శాతం ఖర్చు తగ్గడంతోపాటు రోగులకు నిరంతరాయంగా సేవలు అందుతాయని అధికారులు మంత్రికి 
వివరించారు.