సెక్రటేరియెట్‌‌‌‌ లో ‘ఆక్టోపస్’ మాక్ డ్రిల్

సెక్రటేరియెట్‌‌‌‌ లో ‘ఆక్టోపస్’ మాక్ డ్రిల్
  •  ఉగ్ర ముప్పులను ఎదుర్కొనేలా 130 మంది సిబ్బందితో  విన్యాసాలు

హైదరాబాద్, వెలుగు: సచివాలయంలో ఉగ్రవాద ముప్పులు, అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆక్టోపస్ ఆధ్వర్యంలో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆక్టోపస్ ఎకో స్వాట్ టీమ్ ఎస్వోసీ, డీఎస్పీ బి. మరియ దాసు, అడిషనల్ ఎస్పీ, అసాల్ట్ కమాండర్ రఘునందన్ రావు నేతృత్వంలో జరిగిన ఈ విన్యాసాల్లో వివిధ విభాగాలకు చెందిన 130 మంది పాల్గొన్నారు.

ఆక్టోపస్ నుంచి 45 మంది, తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ నుంచి 36 మంది, సీఎస్‌‌‌‌జీ నుంచి 18 మంది, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల నుంచి 10 మంది చొప్పున పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి 8 మంది, వైద్య బృందం నుంచి 6 మంది, బాంబ్ డిస్పోజల్, అసాల్ట్ డాగ్ టీమ్ నుంచి నలుగురు సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.

అత్యవసర పరిస్థితుల్లో బలగాల స్పందన వేగాన్ని పెంచడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, క్షేత్రస్థాయి కార్యాచరణ సామర్థ్యాలను పరీక్షించడం ఈ డ్రిల్ లక్ష్యం. కార్యక్రమంలో సచివాలయం సీఎస్వో పి. దేవిదాస్, ఏసీపీ శంకర్, డీఎస్పీరామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ మోహన్ రావు, అసిస్టెంట్ కమాండెంట్లు పవన్ కుమార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.