రెండు భాగాలుగా రౌడీ జనార్దన

రెండు భాగాలుగా  రౌడీ జనార్దన

రీసెంట్‌‌‌‌గా ‘రణబాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన  విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం రవికిరణ్ కోలా దర్శకత్వంలో  ‘రౌడీ జనార్దన’ సినిమాలో నటిస్తున్నాడు.  శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్‌‌‌‌డేట్ వైరల్ అవుతోంది.  

ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కథకు స్పాన్ ఎక్కువ ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై టీమ్‌‌‌‌ నుంచి అధికారిక ప్రకటన  రావాల్సి ఉంది. 

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మాస్ ఇంటెన్స్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు.  కీర్తి సురేష్ హీరోయిన్‌‌‌‌గా  నటిస్తోంది. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  మార్చిలో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.