ఛావా దర్శకుడి నుంచి ఈథ

ఛావా దర్శకుడి నుంచి ఈథ

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్‌‌‌‌ ఉటేకర్‌‌‌‌‌‌‌‌ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘ఈథ’. లెజెండరీ మరాఠీ ‘లవానీ’ నృత్యకళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ,  ఒక సాధారణ మహిళా కళాకారిణి జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన అసాధారణ విజయాలను ఇందులో ఆవిష్కరించారు.  

దర్శకుడు లక్ష్మణ్‌‌‌‌ ఉటేకర్‌‌‌‌‌‌‌‌ గత చిత్రం ‘ఛావా’ తరహాలో ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో పాటు విజువల్‌‌‌‌ గ్రాండియర్‌‌‌‌‌‌‌‌తో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఇంప్రెస్‌‌‌‌ చేసింది. విఠాబాయి పాత్రలో శ్రద్ధా కపూర్ ఒదిగిపోయింది.  ట్రెడిషనల్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో శ్రద్ధా లుక్, నృత్యకారిణిగా తన నటన, హావభావాలు ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు మేజర్‌‌‌‌‌‌‌‌ హైలైట్‌‌‌‌గా నిలిచాయి.  మరాఠి మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే 'నౌవారి' చీర ప్రత్యేకత, ప్రాముఖ్యతను వివరించే సీన్స్‌‌‌‌లో శ్రద్ధా చెప్పిన డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  తన కెరీర్‌‌‌‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

అజయ్-అతుల్ అందించిన బ్యాగ్రౌండ్‌‌‌‌ స్కోర్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌ను మరింత ఎలివేట్ చేసింది. రణ్‌‌‌‌దీప్ హూడా కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మహమ్మద్‌‌‌‌ జీషాన్‌‌‌‌, అనంత్ జోషి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  మ్యాడాక్‌‌‌‌ ఫిల్మ్స్‌‌‌‌ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దినేషన్‌‌‌‌ విజన్‌‌‌‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది.