రిలయన్స్ రికార్డుల మోత.. క్యూ2లో రూ.29వేల 550 కోట్ల లాభం

రిలయన్స్ రికార్డుల మోత.. క్యూ2లో రూ.29వేల 550 కోట్ల లాభం
  • రూ.3.62 లక్షల కోట్ల ఆదాయం 
  • ఆరు నెలల్లో రూ.50 వేల కోట్లు దాటిన ప్రాఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • క్రూడాయిల్ ధరలు పెరగడంతో అదరగొట్టిన ఆయిల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 30 కోట్లకు చేరిన జియో 5జీ కస్టమర్లు 

ముంబై: దేశంలో అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వ్యాపార చరిత్రలో కనీవినీ ఎరుగని లాభాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆయిల్ రిఫైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  భారీ లాభాలు రావడంతో కంపెనీ ఆదాయం అమాంతం పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ2) లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ.3.62 లక్షల కోట్లకు (కన్సాలిడేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చేరింది. ఇది ఏడాది లెక్కన  28 శాతం ఎక్కువ.  కంపెనీ నికర లాభం ఏకంగా 34 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.29,550 కోట్లను తాకింది.  ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రిలయన్స్ మొత్తం నికర లాభం రూ.50 వేల కోట్ల మైలురాయిని దాటడం గమనార్హం.  కంపెనీ క్యూ2లో  వ్యాపారాల విస్తరణకు రూ.38,153 కోట్లు ఖర్చు చేసినా, నికర అప్పు రూ.1.23 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు దిగొచ్చింది.  

ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోరు..

రిలయన్స్ ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం  క్యూ2లో అదరగొట్టింది.  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  క్రూడాయిల్ ధరలు పెరగడంతో పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీజిల్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అమ్మకాలపై భారీ లాభం పొందింది.  దీంతో  ఈ విభాగం ఆదాయం క్యూ2లో ఏడాది లెక్కన 44శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా (వడ్డీలు, ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ముందు లాభం)  68శాతం పెరిగి రూ.25,203 కోట్లుగా నమోదైంది.  హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధి వద్ద రవాణా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇతర దేశాల నుం చి క్రూడాయిల్ దిగుమతి చేసుకొని, రిఫైన్ చేసి, పె ట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అమెరికా వంటి దేశాలకు పెద్ద మొత్తంలో ఎగుమతి చేసింది.

జియో లాభం రూ.8,389 కోట్లు

 రిలయన్స్ ఇండస్ట్రీస్  సబ్సిడరీ జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ ఈ ఏడాది క్యూ2 లో రూ.8,389 కోట్ల నికర లాభం సాధించింది. ఇది ఏడాది లెక్కన 14 శాతం ఎక్కువ.  కంపెనీ మొత్తం ఆదాయం 11.3 శాతం వృద్ధి చెంది రూ.47,485 కోట్లకు ఎగబాకింది. కార్యకలాపాల ఆదాయం రూ.40,475 కోట్లు కాగా, ఇబిటా (వడ్డీలు, పన్నులకు ముందు లాభం) రూ.21,879 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–- సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీ నికర లాభం రూ.16,151 కోట్లకు చేరింది.  శాటిలైట్ కమ్యూనికేషన్స్, 6జీ ఐపీ, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై పెట్టుబడులను కొనసాగిస్తామని  జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ ఎండీ ఆకాష్ అంబానీ తెలిపారు. 

సంస్థ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ క్యూ2లో ఏడాది లెక్కన 3.5శాతం పెరిగి రూ.218.8కి చేరింది. ఒక్కో కస్టమర్ సగటున నెలకు 44.2 జీబీ డేటాను వినియోగించారు. కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 54.24 కోట్లకు చేరగా, ఈ  క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నికరంగా 91 లక్షల మంది కొత్తగా చేరారు. జియో 5జీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య ఏకంగా 30 కోట్ల మార్కును తాకింది. కంపెనీ మొత్తం వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెస్ డేటా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 56 శాతం వాటా ఒక్క 5జీ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్ నుంచే రావడం విశేషం. దీంతో పాటు ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాండ్ యూజర్లు 3 కోట్లకు చేరగా, అందులో జియో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైబర్ వాటానే 1.51 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే, ఎన్‌‌‌‌సీడీల ద్వారా ద్వారా రూ.15 వేల కోట్లు సేకరించాలని రిలయన్స్​ నిర్ణయించింది. 

రిటైల్ విస్తరణ

సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్కెట్లు, ఎలక్ట్రానిక్స్ స్టోర్లను నడిపే రిలయన్స్ రిటైల్ క్యూ2లో రూ.91,716 కోట్ల గ్రాస్ రెవెన్యూని సాధించింది.   దసరా, దీపావళి పండుగలు ఉండడంతో డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ3) లో రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది. కంపెనీ క్యూ2లో కొత్తగా 303 స్టోర్లను తెరిచి, దేశవ్యాప్తంగా మొత్తం స్టోర్ల సంఖ్యను 19,947కు పెంచింది. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ షాపింగ్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ ‘జియోమార్ట్’ వ్యాపారం ఏకంగా 42 శాతం వృద్ధి చెంది వెయ్యికి పైగా నగరాలకు విస్తరించింది.