పంజాబ్‌‌‌‌ లో ‘యూపీ మోడల్’ రావాలి..బీజేపీలో చేరిన ఆప్ రెబల్స్.. భగవంత్ మాన్ సర్కార్‌‌‌‌పై విమర్శలు

పంజాబ్‌‌‌‌ లో ‘యూపీ మోడల్’ రావాలి..బీజేపీలో చేరిన ఆప్ రెబల్స్.. భగవంత్ మాన్ సర్కార్‌‌‌‌పై విమర్శలు

న్యూఢిల్లీ: పంజాబ్‌‌‌‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు సోమవారం బీజేపీలో చేరారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు హర్మీత్ సింగ్ పఠాన్‌‌‌‌మాజ్రా, చేతన్ సింగ్ జోరామజ్రా ఆదివారం పార్టీకి రాజీనామా చేయగా.. అమృత్​సర్ నార్త్ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ సోమవారం రాజీనామా చేశారు. 

అనంతరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పంజాబ్ బీజేపీ ఇన్‌‌‌‌చార్జ్ సతీశ్ పూనియా, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ముగ్గురు ఆప్ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఇటీవల ఆప్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరికి చోటు దక్కకపోవడం గమనార్హం.