గండిపేట: చీరతో ఆడుకుంటుండగా ఉరి 8 ఏండ్ల బాలుడు మృతి

గండిపేట: చీరతో ఆడుకుంటుండగా ఉరి 8 ఏండ్ల బాలుడు మృతి
  • పేరెంట్స్​ మార్కెట్​కు వెళ్లి వచ్చేలోగా దారుణం   
  •  మైలార్​దేవ్​పల్లిలో ఘటన మైలా

గండిపేట, వెలుగు :  తల్లిదండ్రులు మార్కెట్​కు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఆడుకుంటున్న ఎనిమిదేండ్ల పిల్లవాడు..వారు వచ్చేసరికి ఇంట్లో ఫ్యానుకు వేసిన చీరకు వేలాడుతూ శవమై కనిపించాడు. అయితే, చీరతో ఆడుకుంటుండగా ఉరి పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా, ఆడుకుంటూ ఉంటే పైన ఫ్యానుకు చీర ఎలా చిక్కుతుందని, చిక్కినా...పిల్లవాడి మెడకు ఉరి ఎలా పడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనపై మైలార్‌‌‌‌దేవ్‌‌‌‌పల్లిలో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. 

యూపీకి చెందిన సూరబ్‌‌‌‌సింగ్, ప్రియాసింగ్‌‌‌‌ లక్ష్మీగూడలో ఉంటూ స్థానిక కంపెనీలో పని చేస్తున్నారు. వీరికి ఆగమ్‌‌‌‌సింగ్‌‌‌‌(8), మరో కూతురు ఉన్నారు. ఆగమ్‌‌‌‌సింగ్‌‌‌‌ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్​స్కూల్​లో చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు మార్కెట్​కు వెళ్లారు. ఆ టైంలో ఆగమ్‌‌‌‌సింగ్ ఇంట్లో చెల్లితో ఆడుకుంటున్నాడు. మార్కెట్‌‌‌‌ నుంచి వచ్చే సరికి ఆగమ్‌‌‌‌సింగ్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌లోని ఫ్యాన్‌‌‌‌కు తల్లి చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. బతికి ఉన్నాడేమో అని అతడిని దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో బాలుడు ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని తేల్చారు. అయితే, అది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.