హైదరాబాద్ సౌత్‎లో ఈఐపీఎల్ గ్రూప్ కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్ సౌత్‎లో ఈఐపీఎల్ గ్రూప్ కొత్త ప్రాజెక్టులు

హైదరాబాద్​, వెలుగు: ఇది వరకే పశ్చిమ హైదరాబాద్‌‌‌‌లో పలు ప్రాజెక్టులు చేపట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ ఈఐపీఎల్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తుక్కుగూడ ప్రాంతంలో సరికొత్తగా రెండు నివాస ప్రాజెక్టులను ప్రకటించింది. ట్రెజర్ ట్రోవ్ పేరుతో ప్రైవేట్ ఎస్టెట్స్, ఆర్బిస్ పేరుతో 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఆర్బిస్ ప్రాజెక్టులో రూ.85 లక్షల ప్రారంభ ధరతో 3 బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ల అపార్ట్‌‌‌‌మెంట్లు అందుబాటులో ఉంటాయి. 

ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 14 సమీపంలో ప్రత్యేక ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. దక్షిణ హైదరాబాద్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నందున అక్కడ దీర్ఘకాలిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధి చైతన్య చల్లా తెలిపారు. ఆధునిక సౌకర్యాలు, మెరుగైన కనెక్టివిటీ కోరుకునే గృహ కొనుగోలుదారులకు ఈ ప్రాజెక్టులు సరిగ్గా సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యమైన నిర్మాణాలతో పాటు విశాలమైన స్థలాలను కేటాయించడమే తమ ప్రత్యేకత అని ఆయన వివరించారు.