ఈ దీపావళి చాలా కాస్ట్లీ గురూ! స్వీట్ల నుంచి టీవీల వరకు ధరలు భారీగా పెంపు.. ఎంత వరకు పెరిగాయంటే..

ఈ దీపావళి చాలా కాస్ట్లీ గురూ! స్వీట్ల నుంచి టీవీల వరకు ధరలు భారీగా పెంపు.. ఎంత వరకు పెరిగాయంటే..

దసరా ఆఫర్లు మిస్సయ్యాం.. దీపావళికి భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి.. కొందాం అనుకునే వాళ్లకు ఇది షాకింగ్ న్యూసే. ధరలు తగ్గుతాయి అనుకుంటే కొండెక్కి కూర్చున్నాయి. కనీసం 3 నుంచి 7 శాతం వరకు రేట్లు పెరిగాయి. చివరికి స్వీట్ల ధరలు కూడా పెరగటం ఆందోళనకరం. ఏ ఏ వస్తువుల రేట్లు ఎంత మేరకు పెరిగాయో చూద్దాం.  

హయర్, ఎల్‌జి, బ్లూస్టార్ వంటి బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను 3-7 శాతం పెంచాయి. హావెల్స్ కూడా 2026 డిసెంబర్ నాటికి 5-7 శాతం వరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. రా మెటీరియల్స్ ధరలు, డెలివరీ ఖర్చులు పెరగడమే దీనికి కారణం అని పేర్కొంటున్నారు.

చివరికి పండుగ పూట కుటుంబం అంతా నోరు తియ్యగ చేసుకుందామనుకుంటే.. స్వీట్ల ధరలు కూడా పెరగటం సామాన్యుడికి పండుగ సంబురం లేకుండా చేస్తున్నాయి. పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాల ధరలు పెరగడం వల్ల సాంప్రదాయ మిఠాయిల ధరలు సుమారు 15 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా ఎల్ నినో కరువు పరిస్థితులు.. పంటల దిగుబడి  అంతగా బాగోలేకపోవడం, రవాణా ఖర్చులు పెరగడం కూడా దీనికి కారణాలుగా చెబుతున్నారు. 

దీపావళి సమయంలో కొత్త వస్తువులు, ఎలక్ట్రానిక్స్, స్వీట్లు కొనే వారికి ఈ ధరల పెరుగుదల అదనపు భారం కావచ్చు. ఎలక్ట్రానిక్స్‌పై 7 శాతం, స్వీట్లపై 15 శాతం వరకు ధరలు పెరగడంతో ఈ ఏడాది దీపావళి చాలా మంది కుటుంబాలకు ఖరీదైన పండుగగా మారే అవకాశం ఉంది.