స్కోడా ఆటో ఇండియా మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా 350 టచ్‌పాయింట్లు, మణిపూర్‌లో తొలి షోరూమ్!

స్కోడా ఆటో ఇండియా మరో మైలురాయి.. దేశవ్యాప్తంగా 350 టచ్‌పాయింట్లు, మణిపూర్‌లో తొలి షోరూమ్!

స్కోడా ఆటో ఇండియా  వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ సంస్థ మణిపూర్ రాష్ట్రంలో  మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కొత్త షోరూమ్‌ను మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఏర్పాటు చేసింది. దీంతో స్కోడా ఆటో ఇండియా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కస్టమర్ టచ్‌పాయింట్ల సంఖ్య 350కి చేరుకుంది. అలాగే మొత్తం 193 నగరాల్లో కార్యకలాపాలను విస్తరించింది.

మణిపూర్‌లో ప్రారంభమైన ఈ కొత్త షోరూమ్ మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకుంది. ఈ ప్రాంతంలో స్కోడా ఆటోతో పాటు SAVWIPL గ్రూప్‌కు చెందిన ఇతర బ్రాండ్లలో కూడా ఇదే తొలి అవుట్‌లెట్ కావడం విశేషం. దీని ద్వారా ఈశాన్య భారతదేశంలోని వినియోగదారులకు స్కోడా కార్లు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, కార్ల కొనుగోలుతో పాటు సర్వీసింగ్, ఇతర అమ్మకాల తర్వాత సేవలను కూడా స్థానికంగానే పొందే అవకాశం కలుగుతుంది.

ఈ సందర్భంగా స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ.. దేశంలోని 193 నగరాల్లో 350 కస్టమర్ టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయడం తమకు ఎంతో ముఖ్యమైన మైలురాయి అని తెలిపారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల వినియోగదారులకు స్కోడా బ్రాండ్‌ను మరింత చేరువ చేయడమే మా లక్ష్యమని చెప్పారు.

ఈ ప్రయాణంలో తమతో కలిసి పనిచేస్తున్న పాత, కొత్త డీలర్ భాగస్వాముల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్కోడా బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయాలనే మా ఆలోచనకు మద్దతు ఇస్తున్న డీలర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త నగరాలు, మార్కెట్లలోకి విస్తరిస్తున్న సమయంలో కస్టమర్లకు మంచి అనుభవాన్ని అందించడం మా  ప్రధాన లక్ష్యమని ఆశిష్ గుప్తా వివరించారు. ముఖ్యంగా కారు కొనుగోలు చేసే సమయంలోనే కాకుండా, కొనుగోలు చేసిన తర్వాత కూడా నాణ్యమైన సేవలు అందించేందుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

అలాగే కొత్త కార్ల మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంతో పాటు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు. విస్తరిస్తున్న డీలర్ నెట్‌వర్క్ వల్ల వినియోగదారుల్లో బ్రాండ్‌పై నమ్మకం పెరుగుతుందని, దేశవ్యాప్తంగా స్కోడాకు మరింత ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2021 నుంచి వేగంగా పెరుగుతున్న స్కోడా నెట్‌వర్క్
భారతదేశంలో స్కోడా ఆటో  కస్టమర్ టచ్‌పాయింట్ల సంఖ్యను గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా పెంచుకుంటూ వస్తోంది.
2021లో: దేశవ్యాప్తంగా 191 కస్టమర్ టచ్‌పాయింట్లు ఉన్నాయి.
2025 నాటికి: ఈ సంఖ్య 325కి పెరిగింది.
2024లో: 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 నగరాల్లో స్కోడా ఉనికిని చాటుకుంది.
అక్టోబర్ 2026 నాటికి: 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 193 నగరాలకు నెట్‌వర్క్‌ను విస్తరించింది.
ప్రస్తుతం ప్రకటించిన మైలురాయి: దేశవ్యాప్తంగా మొత్తం 350 కస్టమర్ టచ్‌పాయింట్లను చేరుకుంది.