క్లినిక్లో బాంబు పేలినట్లు పేలిన మొబైల్ ఫోన్.. బయటకు పరుగులు పెట్టిన పేషెంట్స్!

క్లినిక్లో బాంబు పేలినట్లు పేలిన మొబైల్ ఫోన్.. బయటకు పరుగులు పెట్టిన పేషెంట్స్!

స్మార్ట్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టి వినియోగించలేదు.  హీటెక్కే వరకు గేమ్స్ ఆడలేదు.. అయినా ఫోన్ పేలడం మధ్యప్రదేశ్ లో భయాందోళనలకు గురిచేసింది. అది కూడా  నెలలు కూడా నిండని మాతా శిశువులు, ఇతర పేషెంట్స్ ఉన్న చోట క్లినిక్ లో పేలడం కలకలం రేపింది. ఆదివారం (2026 నవంబర్ 01) గ్వాలియర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

దృష్టి స్కిన్ అండ్  చైల్డ్ క్లినిక్ లో.. డాక్టర్ ను కలిసేందుకు పేషెంట్స్ వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో డాక్టర్ అశుతోష్ శర్మ క్లినిక్ లోనే ఉన్నారు. ఆ సమయంలో ఫోన్ పేలడంతో పేషెంట్స్ భయంతో వణికిపోయారు. 

►ALSO READ | సిటీ లైఫ్కు బైబై.. బెంగళూర్ నుంచి గోవాకు మకాం మార్చిన జంట.. ఖర్చుల లెక్కలపై చర్చ!

అయితే ఘటన జరిగిన వెంటనే హాస్పిటల్ స్టాఫ్ చాకచక్యంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. మండుతున్న ఫోన్ పైన నీళ్లు పోసి మంటలు కంట్రోల్ అయ్యేలా చూశారు. దీంతో మంటలు హాస్పిటల్ అంతా వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ఘటనలో ఏ ఒక్కరికీ తీవ్రమైన గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.