కోలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందా? ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపైకి తీసుకొచ్చేందుకు లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే ప్రచారం ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. స్టార్ హీరోలు సూర్య, ధనుష్‌లను కలిపి ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కించేందుకు మణిరత్నం ఆసక్తి చూపిస్తున్నారనే టాక్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
లేటెస్ట్ సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇద్దరు బలమైన కథానాయకులు ఉండేలా మణిరత్నం ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సూర్య, ధనుష్‌లను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది . కథపై ఇద్దరు హీరోలు కూడా ఆసక్తి చూపించారనే చర్చ నడుస్తోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కాలంటే హీరోల డేట్స్, రెమ్యునరేషన్లు, ఇతర కమిట్‌మెంట్లు కుదరాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సూర్య గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఆయుత ఎళుత్తు' (2004) చిత్రంలో నటించారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ధనుష్‌కు మాత్రం మణిరత్నంతో ఇదే తొలి సినిమా కానుంది. ఈ ఇద్దరు విలక్షణ నటులను ఒకే కథలో చూపించడం దర్శకుడికి పెద్ద సవాలే అయినా, అభిమానులకు మాత్రం కనుల పండుగే.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం మణిరత్నం విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా 'ఇంజి వెల్లం' అనే రొమాంటిక్ డ్రామాను రూపొందించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2027 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు సూర్య నటించిన 'సీన్' నవంబర్ 6న, ధనుష్ నటించిన 'OM: చాప్టర్ 1' నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల తర్వాత మణిరత్నం మల్టీస్టారర్‌పై స్పష్టత వస్తుందేమో చూడాలి. నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే కోలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది.
