చిన్నతనం నుంచే అద్భుతాలు చేస్తూ .. ఈ అమ్మాయి పెద్దయ్యాక రికార్డ్స్ సృష్టిస్తుంది.. అని కోచ్ లు సైతం మెచ్చుకునే ప్రతిభ కనబరుస్తున్న గోల్ఫ్ ప్లేయర్.. 15 ఏళ్లకే పిడుగుపాటుకు బలికావడం తీవ్ర విషాదాన్ని నింపింది.
థాయ్ జూనియర్ గోల్ఫ్ క్రీడాకారిణి ఐయవరిన్ అయేయా ప్రదుబ్యార్ట్ , చాచోంగ్సావోలో జరిగిన యూత్ టోర్నమెంట్ సందర్భంగా పిడుగుపాటుకు గురై ఒక రోజు తర్వాత, అంటే నవంబర్ 2, 2026న చనిపోవడం అటు క్రీడాలోకంలో, ఇటు కుటుంబంలో తీరనిలోటుగా నిలిచింది.
బాంగ్ నామ్ ప్రియావో జిల్లాలోని మూ 8, ఓంగ్‌ఖరక్–బాంగ్ నామ్ ప్రియావో రోడ్డులోని ఒక గోల్ఫ్ కోర్సులో సాయంత్రం సుమారు 4 గంటలకు ఈ ఘటన జరిగింది. 31 ఏళ్ల సైతాన్ అనే మహిళా క్యాడీ కూడా ఈ ఘటనలో గాయపడింది.
అంతకు ముందేపిడుగులు.. అయినా పోటీలతోనే ఘటన:
పిడుగు పడి అయేయా చనిపోక ముందు కూడా పిడుగులు పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పిడుగులు పడి వాతావరణం ఆందోళనకరంగా ఉన్నప్పుడు పోటీ ఎందుకు కొనసాగించారని అయేయా కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, పోటీ జరిగే ప్రదేశంలో అంబులెన్స్ లేకపోవడం వల్ల ఆమెను ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించింది.
పిడుగు పడిన తర్వాత అయేయాను అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పల్స్ ఆగిపోయిన పరిస్థితుల్లో ఘటనా స్థలంలోనే కార్డియోపల్మోనరీ రీససిటేషన్ (CPR) చేసి, ఆమె గుండె కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత బాంగ్ నామ్ ప్రియావో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మెరుగైన వైద్యం కోసం బుద్ధసోథోర్న్ ఆసుపత్రికి తరలించారు.
నాడి తిరిగి కొట్టుకోవడానికి ముందు దాదాపు గంటసేపు ఆమె గుండె ఆగిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, రాత్రంతా ఆమె పరిస్థితి విషమంగానే ఉంది అంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
అంబులెన్స్ లేకపోవడంతోనే..
మధ్యాహ్నం సుమారు 3 గంటలకు గోల్ఫ్ కోర్సుకు ఎడమ వైపున ఉన్న పైన్ చెట్ల దగ్గర మెరుపు మెరిసిన శబ్దం విన్నానని, ఆ తర్వాత మరికొన్ని మెరుపులు కూడా వినిపించాయని ఆమె తల్లి నాట్చా చెప్పారు. వర్షం పడుతూ వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ అధికారులు ఆట ఆపమని ఆదేశించకపోవడంతో గోల్ఫ్ క్రీడాకారులు ఆట కొనసాగించారని ఆమె ఆరోపించారు. కోర్సుకు కుడి వైపున పెద్ద శబ్దంతో పిడుగు పడి.. భారీ వర్షం మొదలైన తర్వాతే అధికారులు పోటీని నిలిపివేసి, గోల్ఫ్ క్రీడాకారులను తీసుకువెళ్లడానికి వాహనాలను ఏర్పాటు చేశారు.
►ALSO READ | ఒలింపిక్స్ లో కబడ్డీకి చోటు కల్పించడమే లక్ష్యం : IFK అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
అయేయా ఉదయం 11 గంటల నుంచే పోటీలలో పాల్గొంటూ రెండు రౌండ్లలో పాలుపంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకుముందు రెండుసార్లు పిడుగులు పడిన తర్వాత కూడా అధికారులు ఆటను కొనసాగించడానికి అనుమతించారని ఆమె ఆరోపించారు. ఆమె చెప్పిన దాని ప్రకారం, మూడోసారి పిడుగు పడినప్పుడు అయేయా 11వ హోల్ వద్ద ఉంది.
ఆమె అయేయా తల కుడి వైపు, శరీరం, చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు అయ్యాయని, అలాగే టోపీ చిరిగిపోయిందని చెప్పారు. కోర్సు దగ్గరఅంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, ఆయాను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చిందని ఆమె అమ్మమ్మ ఆరోపించింది. తన మనవరాలు అనేక పోటీలలో అవార్డులు గెలుచుకుని ప్రావిన్షియల్ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిగా ఎదుగుతోందని అమ్మమ్మ అఫోర్న్ చెప్పారు. ఆమె అద్భుత ప్రదర్శన కారణంగా చోన్ బురి ప్రావిన్షియల్ గోల్ఫ్ జట్టుకు రిజర్వ్‌గా ఎంపికయ్యారు.
అయేయా తండ్రి మయన్మార్‌లో పని చేస్తుంటాడు. విషయం తెలిసి ఆయన తిరిగి వచ్చేవరకు, రాత్రికి రాత్రే అయేయా పరిస్థితి విషమించిందని చెప్పారు. మంచి భవిష్యత్తు ఉన్న తన కూతురు అర్థంతరంగా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
