- మూడు సెట్ల పోరులో ఓడినా.. ఆటతీరుతో ప్రేక్షకుల ప్రశంసలు
చెన్నై: 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టెన్నిస్ వేదికపై జెన్సీ కనబార్ సత్తా చాటింది. గుజరాత్‌లోని జునాగఢ్ నుంచి దాదాపు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి చెన్నై ఓపెన్‌లో అడుగుపెట్టిన ఈ యువ క్రీడాకారిణి.. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ వెరోనికా ఫాల్కోవ్‌స్కాకు గట్టి పోటీ ఇచ్చింది. పోలాండ్‌కు చెందిన 287వ ర్యాంకర్‌తో జరిగిన మ్యాచ్‌లో 2–6, 7-–5, 6–-3తో ఓటమి పాలైంది. తొలి సెట్ కోల్పోయినా.. రెండో సెట్‌లో ప్రత్యర్థి బలహీనతలను గుర్తించి విజయం సాధించింది. నిర్ణాయక సెట్‌లోనూ పోరాడినప్పటికీ అనుభవం ముందు నిలవలేకపోయింది.
చివరి నిమిషంలో వైల్డ్‌కార్డ్ దక్కించుకున్న జెన్సీ.. తన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. జెన్సీకి మూడున్నరేళ్ల వయసు నుంచే తండ్రి దీపక్‌భాయ్ టెన్నిస్ శిక్షణ ఇప్పిస్తున్నారు. జర్మనీ దిగ్గజ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ స్ఫూర్తితో కుమార్తెను టెన్నిస్ వైపు నడిపించారు. ఈ ఏడాది అండర్-14 ఆసియా-పసిఫిక్ ఓపెన్ గెలిచిన జెన్సీకి గౌరవంగా జునాగఢ్ జిమ్‌ఖానాలో ఆమె శిక్షణ పొందిన కోర్టుకు ఆమె పేరు పెట్టారు.
