న్యూఢిల్లీ: గ్లోబల్‌గా ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇండియా అక్టోబర్‌లో రికార్డ్ స్థాయిలో క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. భారత రిఫైనరీలు గల్ఫ్, రష్యాల నుంచి పెద్దఎత్తున కొనుగోళ్లు జరపడంతో దిగుమతులు రోజుకు దాదాపు 56 లక్షల బ్యారెళ్లకు పెరిగినట్లు కెప్లర్ సంస్థ వెల్లడించింది. గల్ఫ్ దేశాల నుంచి రోజుకు దాదాపు 23 లక్షల బ్యారెళ్లు సరఫరా కాగా, రష్యా నుంచి దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అయింది. హార్మూజ్ జలసంధి ద్వారా సరఫరా మెరుగుపడటంతో గల్ఫ్ చమురు రాక పెరిగింది.
