కర్రెగుట్టలోని భూములపై గిరిజనులకే హక్కు.. గిరిజన సంఘాల ఐక్యవేదిక డిమాండ్

కర్రెగుట్టలోని భూములపై గిరిజనులకే హక్కు.. గిరిజన సంఘాల ఐక్యవేదిక డిమాండ్

వెంకటాపురం, వెలుగు: కర్రెగుట్టలోని సాగు భూములు గిరిజనులకే హక్కు కల్పించాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక (జాక్) కేంద్ర, రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కర్రెగుటల్లో వందల ఏళ్ల నుంచి పామునూరు, జెల్లా, డోలి, చెలిమల, తడపల, ముకునూరు గ్రామాలను ఏర్పరచుకొని గిరిజనలు సామూహిక జీవనం కొనసాగించారు. 

1980లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆయా ప్రాంతాలలోని గిరిజనులను మైదాన ప్రాంతాలకు (వెంకటాపురం మండలంలోకి) తరలించారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకపోయినా తప్పని పరిస్థితుల్లో ఆయా గిరిజనలు జీవనం కొనసాగిస్తున్నారు.

 ప్రస్తుతం కర్రెగుట్టలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడంతో ఆయా సాగు భూములను అప్పటి గిరిజనులకు కేటాయించాలని అన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జంగిల్ జంగిల్ జమీన్ హమారా అంటూ నినాదాలు చేశారు. పూనెం సాయి, కొర్స నర్సింహా మూర్తి, యాసం రాజు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు