భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా చేయవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 28న ప్రారంభం కాగా నవంబర్ 18 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఇంజినీర్.
మొత్తం ఖాళీలు: 350.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రొబేషనరీ ఇంజినీర్/ ఈ–II – ఎలక్ట్రానిక్స్ 200 (అన్ రిజర్వ్డ్ 81, ఈడబ్ల్యూఎస్ 20, ఓబీసీ 54, ఎస్సీ 30, ఎస్టీ 15), ప్రొబేషనరీ ఇంజినీర్/ ఈ-II - మెకానికల్ (అన్ రిజర్వ్డ్ 62, ఈడబ్ల్యూఎస్ 15, ఓబీసీ 40, ఎస్సీ 22, ఎస్టీ 11).
విద్యార్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (4 సంవత్సరాల కోర్సు) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
అన్ రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.
వయసు: 2026, అక్టోబర్ 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 28.
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలు రూ. 1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: నవంబర్ 18.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (85 మార్కుల వెయిటేజీ), ఇంటర్వ్యూ (15 మార్కుల వెయిటేజీ) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ bel-indiaను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ఎగ్జామ్లో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం రెండు పార్టులు ఉంటాయి. 125 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు. పార్ట్–1లో టెక్నికల్ అంశం నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు. ఈ ఎగ్జామ్లో అర్హత సాధించాలంటే జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
