జాతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగం మరువలేనిది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

జాతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగం మరువలేనిది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన క్రయక్రమం నిర్వహించారు. బుధవారం ( నవంబర్ 4 ) జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో  మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జాతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగం మరువలేనిదని.. అంబేద్కర్ పట్టుదలను మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.

నెల రోజుల క్రితం తనకు ఈ కార్యక్రమం గురించి చెప్పారని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతేడాది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యనని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించాలని కోట్లాడిన వ్యక్తి అంబెడ్కర్ అని.. ఆ రోజుల్లో గాంధీ తో కొట్లాడడం సామాన్య విషయం కాదని అన్నారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో  కళాకారులు అందరూ చాలా చక్కగా నటించారని.. కళాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..

ప్రతిసారి ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఈ కార్యక్రమం నిర్వహిస్తునందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు అభినందినలు తెలుపుతున్నానని అన్నారు. అంబేద్కర్ ప్రత్యక్షంగా వచ్చినట్లు అనిపించిందని..నాటికలో డైలాగ్ లు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. కల్చర్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక్క నాటక ప్రదర్శన చేసే బావిష్యత్ లో ఏర్పాటు చేస్తే మంచిదని అన్నారు మల్లు రవి.

అంబేద్కర్ ఓటు అమ్మితే బానిసత్వం, ఓటటును నమ్మితే అధికారం అని సందేశం ఇచ్చారని.. ఈ నాటకం అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించే విధంగా సీఎం తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ నాటకాన్ని రాష్ట్రానికే కాదు దేశ వ్యాప్తంగా ప్రదర్శించే విధంగా ప్రయత్నాలు చేస్తానని అన్నారు మల్లు రవి.