బర్త్‌డేకి ముందే కింగ్ కోహ్లీ రచ్చ.. 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

బర్త్‌డేకి ముందే కింగ్ కోహ్లీ రచ్చ.. 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!

Virat Kohli Fifty: తన 38వ పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందు (నవంబర్ 5న కోహ్లీ పుట్టినరోజు) 'కింగ్' విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో పండగ చేసుకున్నాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 186 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ కేవలం 35 బంతుల్లోనే దిమ్మతిరిగే హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ఆరంభం నుంచే కివీస్ బౌలర్ల తాట తీసాడు.

విదేశాల్లో రెండో ఫాస్టెస్ట్ వన్డే ఫిఫ్టీ: 

ఛేజింగ్ చేయడానికి కావాల్సిన రన్ రేట్ 4 కంటే తక్కువగానే ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం దండయాత్ర కొనసాగించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిదానంగా ఆడుతూ సింగిల్స్ ఇస్తుంటే, కోహ్లీ మాత్రం 100కు పైగా స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడ్డాడు. మైదానంలో గ్యాప్‌లు వెతుక్కుంటూ ఫోర్లు బాదడమే కాకుండా, వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగులు తీస్తూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. 

►ALSO READ | భారత్ జోరుకు వర్షం బ్రేక్.. 54/1 వద్ద నిలిచిన ఆట!

కాగా విదేశీ గడ్డపై (Away ODIs) విరాట్ కోహ్లీకి ఇది రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఒక  హాఫ్ సెంచరీతో స్టేడియంలోని అభిమానులు విరాట్ విరాట్ అంటూ నినాదాలు చేస్తున్నారు. 

సెంచరీ దిశగా కింగ్ ఇన్నింగ్స్:

186 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయం వైపు వేగంగా దూసుకెళ్తోంది. తన 38వ బర్త్‌డే వేడుకలను ఒక రోజు ముందే గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్ల జాతరతో గ్రాండ్‌గా షురూ చేశాడు కింగ్ కోహ్లీ.