సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంతో సహా హైదరాబాద్లోని క్యూఆర్ఈ హైదరాబాద్ (CURE-Hyderabad) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు నవంబర్ 4, 2026న తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆన్లైన్ ద్వారా మాప్-అప్ ఈ-లాటరీ ప్రక్రియను నిర్వహించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన మిగిలిన అభ్యర్థుల జాబితా నుంచి కంప్యూటరైజ్డ్ విధానంలో ఈ మాప్-అప్ ఈ-లాటరీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
గత విడత (ఆగస్టు 2026) లాటరీలో ఎంపికైన లబ్ధిదారులలో కొందరు అనర్హులుగా తేలడం, సొంత ఇల్లు కలిగి ఉండటం, నిర్దేశిత నియోజకవర్గంలో నివసించకపోవడం, నిర్ణీత రుసుము (రూ. 1 లక్ష) సకాలంలో చెల్లించలేకపోవడం వంటి కారణాల వల్ల దాదాపు 17వందల ఫ్లాట్లు ఖాళీగా మిగిలాయి.ఈ ఖాళీలను భర్తీ చేయడం కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన మిగిలిన అభ్యర్థుల జాబితా నుంచి కంప్యూటరైజ్డ్ విధానంలో ఈ మాప్-అప్ ఈ-లాటరీ నిర్వహించారు.
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
