రూ.40 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన బజార్ హత్నూర్ ఎస్సై

రూ.40 వేల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన బజార్ హత్నూర్ ఎస్సై

ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి పోలీస్ అధికారి ఏసీబీ వలకు చిక్కారు.  ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎస్సై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. న్యాయం  చేయాలని పోలీస్ స్టేషన్ కు వస్తే.. బాధితుడినుంచి లంచం తీసుకోవడం  స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
 
ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌లో ఎస్సై రమేష్ రూ.40 వేల లంచం తీసుకుంటుండగా  బుధవారం (నవంబర్ 4) ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసి రూ.40 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.  రమేష్ నుంచి  రూ. 40వేల నగదు స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ చేపట్టారు.