అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ రిపబ్లిక్ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించారు డ్రెమోక్రటిక్స్. సరిగ్గా ఇదే సమయంలో నార్త్ కొరియా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫేస్ టూ ఫేస్ చర్చలకు.. నిన్నా మొన్నటి వరకు ఓకే చెప్పిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్.. ఇప్పుడు మాటమార్చాడు. ట్రంప్ తో ఫేస్ టూ ఫేస్ చర్చలకు నో చెప్పారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ ఓడిన వెంటనే.. ఆయనతో చర్చలు లేవని స్పష్టం చేస్తూ.. క్షిపణి ప్రయోగాలు చేశారు కిమ్. 2026, నవంబర్ 4వ తేదీ ఉదయం.. ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి.. భారీ సంఖ్యలో మిస్సైల్స్ ప్రయోగాలు చేశారు కిమ్. ఈ క్షిపణులు అణ్వాయుధాలను తీసుకెళ్లగలవని.. అణు బాంబులను వేయగలవు అంటూ నార్త్ కొరియా దేశం ప్రకటించింది. నమ్మకద్రోహులు, శత్రువులు అయిన వ్యక్తులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదు.. మా దేశ భద్రత మేం చూసుకోగలం.. మా దేశానికి ఏం కావాలో మాకు తెలుసు అంటూ నార్త్ కొరియా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పింది ఆ దేశం.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ దగ్గరుండి పర్యవేక్షించాడని.. అధునాతనమైన, శక్తివంతమైన యుద్ధ నౌకల నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే.. నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా అప్రమత్తం అయ్యింది. సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేసింది.
ALSO READ : ట్రంప్‌ను ఛీ కొట్టిన అమెరికా.. ఇంత ఘోర ఓటమికి కారణాలు ఇవే..!
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓడిన తర్వాత.. నార్త్ కొరియా రెచ్చిపోవటం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో కిమ్ తన సత్తా మరింత చూపిస్తాడనేది అర్థం అవుతుంది. గతంలో ఇదే ట్రంప్ తో తన దేశంలోనే చర్చలు జరిపాడు కిమ్. ఈసారి కూడా అదే విధంగా చర్చలు జరుగుతాయని అనుకుంటున్న టైంలో.. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్.. యూటర్న్ తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
