మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘రామాయణ’ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్న ఈ మెగా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఓవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్ దగ్గర హడావుడి మొదలవగా.. మరోవైపు సినిమాపై విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్పట్లో ‘రామాయణ’ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించి తన నటనతో కట్టిపడేసిన లక్ష్మణుడు సునీల్ లహ్రీ స్పందించారు. కొత్త ‘రామాయణ’పై తన మనసులోని మాటను ఓ వీడియో రూపంలో బయటపెట్టారు.
నితేశ్ తివారీపై ఫుల్ కాన్ఫిడెన్స్..
సునీల్ లహ్రీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాను ఇంకా సినిమాను చూడలేదని, కాబట్టి దానిపై జడ్జ్మెంట్ ఇచ్చే స్థాయిలో మాట్లాడలేనని స్పష్టం చేశారు. అయితే డైరెక్టర్ నితేశ్ తివారీపై మాత్రం తనకు నూటికి నూరు శాతం నమ్మకం ఉందని కుండబద్దలు కొట్టారు.
గతంలో నితేశ్ తివారీ తెరకెక్కించిన సినిమాలు తనను ఆకట్టుకున్నాయని, ఆయన మంచి దర్శకుడని సునీల్ ప్రశంసించారు. ఈ సినిమాలో భాగమైన నటీనటులంతా టాలెంటెడ్ పర్సన్స్ అని, ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టును రూపొందించారని కొనియాడారు. రామాయణం అనేది కేవలం భారతీయులకే పరిమితమైన ఇతిహాసం కాదని.. యావత్ మానవాళికి గొప్ప సందేశాన్నిచ్చే మహాకావ్యమని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు, భావోద్వేగాలకు ప్రతిరూపమైన ఈ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
మ్యూజిక్‌పై మాత్రం అసంతృప్తి..
అంతా ఓకే అనుకున్న టైమ్‌లో సునీల్ లహ్రీ మ్యూజిక్ విషయంలో తన అసంతృప్తిని బయటపెట్టారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ వంటి గ్లోబల్ మ్యూజిక్ లెజెండ్స్ పనిచేస్తుండటంతో ఆల్బమ్‌పై తనకు భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు విన్న కొన్ని పాటలు, మ్యూజిక్ బిట్స్ మాత్రం తనను అంతగా ఇంప్రెస్ చేయలేదని ఓపెన్‌గా కామెంట్ చేశారు.
नई रणबीर कपूर वाली रामायण के बारे में कई लोगों ने मेरे विचार मेरी आलोचना जाननी चाही, तो देखिए और जानिये क्या है मेरे विचार... Many people wanted to know my views and opinion about the new Ramayana, so check out what's my views & opinion On new Ramayan https://t.co/hqm3YIaJtY
— Sunil lahri (@LahriSunil) November 3, 2026
ముఖ్యంగా అయోధ్య, మిథిల ప్రాంతాల రియల్ కల్చరల్ ఫ్లేవర్ మ్యూజిక్‌లో మిస్ అయినట్లు అనిపించిందన్నారు. ‘రామాయణం’ లాంటి ఎపిక్ స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ అని, అది సినిమాకు బ్యాక్‌బోన్ లాంటిదని పేర్కొన్నారు. పాటల్లో ఆయా ప్రాంతాల ట్రెడిషనల్ సౌండ్స్, కల్చర్, లోకల్ ఫ్లేవర్ తప్పనిసరిగా రిఫ్లెక్ట్ కావాలని తన అభిప్రాయాన్ని షేర్ చేశారు.
అయితే ఇవి కేవలం ఒక మ్యూజిక్ లవర్‌గా తన పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఈ మెగా బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని కోరుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్‌పై ఎంతోమంది ఉపాధి ఆధారపడి ఉందని చెబుతూ.. టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందించారు. చివరగా ‘జై శ్రీరామ్’ అంటూ తన వీడియోను ముగించారు.
