బైకర్ వెంబడి ఒకవైపు యమధర్మ రాజు.. మరో వైపు స్ట్రెచర్.. ట్రాఫిక్ పోలీసుల వీడియో వైరల్

బైకర్ వెంబడి ఒకవైపు యమధర్మ రాజు.. మరో వైపు స్ట్రెచర్.. ట్రాఫిక్ పోలీసుల వీడియో వైరల్

ఓవర్ స్పీడుతో జీవితాలను తలకిందులు చేసుకుంటున్న యువతకు కనువిప్పు కలిగేలా సైబరాబాద్ పోలీసులు చేసిన వీడియో వైరల్ గా మారింది. రోడ్డుపై విన్యాసాలు చేస్తూ వెళ్తున్న బైకర్ ను యమధర్మ రాజు, స్ట్రెచర్ తో డాక్టర్ ఫాలో అవుతున్న వీడియో వినూత్నంగా ఆలోచింపజేస్తోంది. 

హెల్మెట్ లేకుండా రోడ్డెక్కడమే కాకుండా.. ఓవర్ స్పీడుతో రోడ్డుపై విన్యాసాలు చేసే యువతను రోజూ చూస్తూనే ఉంటాం. స్పీడుగా వచ్చి మరో వాహనం ముందు కట్ కొట్టడం, రాంగ్ రూట్ లో వస్తూ కూడా ఓవర్ స్పీడు మెయింటైన్ చేయడం లాంటి ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ లాంటి సిటీల్లో మరీ ఎక్కువ. ఒకవైపు ట్రాఫిక్ జాంలను క్లియర్ చేసేందుకు కష్టపడే పోలీసులకు.. ఈ ఓవర్ స్పీడుగాళ్ల వళ్ల మరింత తలనొప్పి ఏర్పడుతోంది. 

స్పీడుగా వెళ్లడం.. ఎక్కడో పడటం.. ఓవర్ స్పీడుతో మరో వెహికిల్ ను గుద్దేయటం.. ఇంతకు మించి అతి వేగంతో సాధించేది ఏం లేదు అంటున్నారు పోలీసులు. రోడ్డుపైన ఎవరైనా వేగంగా వెళ్తే.. అంత స్పీడేంట్రా బాబూ అంటే నువ్వేందిరా నాకు చెప్పేది అని.. గొడవకు దిగే బ్యాచ్ లు ఎక్కువయ్యాయి. చివరికి లేనిపోని యాక్సిడెంట్ కు గురికావడంతో.. వీళ్ల వలన వీళ్ల కుటుంబాలతో పాటు ఎదుటి వారిని కూడా రిస్కులో పెడుతుంటారు.

►ALSO READ | ములుగులో వైన్స్‌ షాపులపై ఎక్సైజ్ దాడులు.. కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం

అందుకే అలాంటి వారికి అవగాహన కల్పించేందుకు పోలీసులు చేసిన ప్రయోగానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది షేర్ చేస్తున్నారు. ఒక వైపు యముడు, మరో వైపు స్ట్రెచర్.. వెనకాలే పాడెతో కనివిప్పు కలిగేలా వీడియో షేర్ చేశారు. 

అతివేగం.. జీవితాంతం విషాదం.. జీవితాన్నే తలకిందులు చేస్తుంది.. అతివేగంతో యముడిని తొందరగా కలుసుకోవడం తప్ప సాధించేది ఏమీ లేదనే అర్థం వచ్చేలా తీసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మీరు కూడా చూసి షేర్ చేయండి.