ప్రధాని మోదీ అధ్యక్షతన నవంబర్ 4న సమావేశమైన కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. 92 గిగావాట్ అవర్ల (GWh) గ్రిడ్ స్థాయి ఎనర్జీ స్టోరేజ్ స్కీమ్‌కు, 24 కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పథకానికి ఆమోదం తెలిపింది.దీంతోపాటు జాతీయ గణాంక వ్యవస్థ పునర్నిర్మాణానికి రూ.4వేల371 కోట్లు కేటాయించింది.
ఎనర్జీ స్టోరేజ్ స్కీమ్
92 GWh స్టోరేజ్ సామర్థ్యంలో 30 GWh బ్యాటరీ స్టోరేజ్, 60 GWh పంప్డ్ స్టోరేజ్, 2 GWh కొత్త టెక్నాలజీ కోసం కేటాయించారు. ఈ స్కీమ్ క్లీన్ ఎనర్జీ రంగానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పని చేస్తుందని కేంద్రం తెలిపింది.
24 కీలక ఖనిజాల ప్రాసెసింగ్
గనుల నుంచి సేకరించిన ఖనిజాలతో పాటు రీసైక్లింగ్ ద్వారా లభించే ముడి పదార్థాలను ఈ పథకం కింద ప్రాసెస్ చేస్తారు. గనుల ద్వారా లేదా రీసైక్లింగ్ ద్వారా వచ్చిన ముడి ఖనిజాన్ని నేరుగా తయారీ పరిశ్రమలకు ఉపయోగపడే స్థాయికి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, రక్షణ పరికరాలు, భారీ యంత్రాల తయారీ రంగాలకు ఈ ప్రాసెస్ చేసిన ఖనిజాలు ముడి పదార్థంగా ఉపయోగించనున్నారు.
►ALSO READ | CNG సిలిండర్ పై స్కూల్ పిల్లలను కూర్చోబెట్టిన ఆటోవాలా : ఎంత డేంజరో అర్థం అవుతుందా వీడికి..!
జాతీయ గణాంక వ్యవస్థకు రూ.4వేల371 కోట్లు
జాతీయ గణాంక వ్యవస్థను నవీకరించేందుకు రూ.4వేల371 కోట్ల నూతన పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులతో గ్రౌండ్ ట్రూథింగ్, డేటా సేకరణ ఫ్రీక్వెన్సీ పెంపు, సర్వే పద్ధతుల ఆధునీకరణ, సర్టిఫికేషన్ కోర్సులు చేపడతారు. డేటా కలెక్షన్ బయాస్ తగ్గించి మరింత కచ్చితమైన గణాంకాలు సేకరించేలా వ్యవస్థను తీర్చిదిద్దుతారని కేంద్రం తెలిపింది.
