మహబూబ్ నగర్ లో ఆకతాయిల వికృత చేష్టలు మితిమీరిపోయాయి. పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులను డ్యామేజ్ చేయడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేటెస్టుగా కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన బ్యూటిఫికేషన్ పనులను ధ్వంసం చేయడం పోలీసుల దృష్టికి వచ్చింది.
టౌన్ లో ఇటీవలే కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ట్యాంక్ బండ్ పై అందంగా తీర్చిదిద్దిన బ్యూటిఫికేషన్ వర్క్స్ ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. మినీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న డిస్ ప్లే బోర్డును, ఐ లవ్ మహబూబ్ నగర్ బోర్డును పగలగొట్టారు దుండగులు.
అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారకులు ఎవరనే అంశంపై విచారణ చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
