హైదరాబాద్లో ఐటీ సంస్థలకు అలర్ట్.. మధ్యాహ్నం నుంచే లాగ్అవుట్లు.. రెండు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచే..

హైదరాబాద్లో ఐటీ సంస్థలకు అలర్ట్.. మధ్యాహ్నం నుంచే లాగ్అవుట్లు.. రెండు రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచే..
  • వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సైబరాబాద్​ పోలీసుల సూచన 
  • వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయం

గచ్చిబౌలి, వెలుగు: వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండటంతో పాటు,  నవంబర్ 4 నుంచి 5వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలు, సంస్థలకు కీలక సూచనలు జారీ చేశారు. 

వర్షాలతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగే అవకాశం ఉండటంతో పాటు, ఉద్యోగులు ప్రయాణించే టైంలో ఇబ్బందులు ఎదురుకాకుండా, అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 4 నుంచి 5వ తేదీ వరకు ఐటీ కంపెనీలు మధ్యాహ్నం 2 గంటల నుంచే దశలవారీగా ఉద్యోగులకు ముందస్తు లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవుట్‌‌‌‌‌‌‌‌ లు ఇవ్వాలని కోరారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉద్యోగుల లాగ్‌‌‌‌‌‌‌‌అవుట్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 4 గంటలలోపే ఇండ్లకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని ఐటీ సంస్థలకు సూచించారు. ఇలా ప్లాన్ ​చేసుకునే కంపెనీలు లాగ్‌‌‌‌‌‌‌‌అవుట్ సమయాల వివరాలను [email protected] కు పంపించాలని కోరారు.