హైదరాబాద్లో పట్టపగలే జంట హత్యలు

హైదరాబాద్లో పట్టపగలే జంట హత్యలు

హైదరాబాద్ సిటీలో పట్టపడలే జంట హత్యలు జరగడం కలకలం రేపింది. ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలని ఉదయం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇచ్చారో లేదో.. గంటల వ్యవధిలోనే ఇద్దరి హత్య  జరిగింది. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2026 నవంబర్ 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

స్థానికుల వివరాల ప్రకారం షరీఫ్ నగర్‌కు చెందిన షేక్ మహమ్మద్ సిద్ధిఖీ, అతని భార్య నూర్ బేగం మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబ వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త గొడవ పడుతుండటంతో నూర్ భేగం మీర్‌పేట్‌లోని సాయి విహార్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లారు. తన భర్త నుంచి ప్రాణ హాని ఉందని ఉదయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

అయితే సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో అత్తగారి ఇంటికి చేరుకున్న షేక్ మహమ్మద్ సిద్ధిఖీ.. కత్తితో తన అత్త షేక్ నిరంజన్ బీ (50), బామ్మర్ది భార్య రేష్మా (40), బావమరిది యూసుఫ్‌పై తీవ్రంగా దాడి చేశాడు. 

ఈ దాడిలో షేక్ నిరంజన్ బీ, రేష్మా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. యూసుఫ్ గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.  ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.