వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లొచ్చే సిరికి ఇల్లు గుళ్ల చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. దాదాపు ఎనిమిది లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లారు దుండగులు. 2026 నవంబర్ 4న వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల టౌన్ లోని గాంధీనగర్ వీధిలో చోరీ జరిగింది. బీరువాలో ఉన్న 5 తులాల బంగారం , 15 తులాల వెండి ఆభరణాలతో పాటు 40 వేల రూపాయల నగదు అపహరించారు దొంగలు. రాధా అనే మహిళ 15 రోజుల క్రితం వేములవాడ వెళ్లి.. ఇవాళ ఇంటికి వచ్చి చూసే సరికి దొంగలు పడినట్లు గుర్తించారు.
తళలాలు పగలగొట్టి దొంగతనం చేశారు దుండగులు . దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
