ఎంపీ వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్ పాటించాలి..కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ను వెంటనే ఎత్తివేయాలి

ఎంపీ వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్ పాటించాలి..కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ను వెంటనే ఎత్తివేయాలి
  • మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు సమాధానం చెప్పాలి: గుమ్మడి కుమారస్వామి, మల్లికార్జున్

జ్యోతినగర్, వెలుగు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రొటోకాల్ పాటించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, మల్లికార్జున్ అన్నారు. మల్హార్ మండలం కొయ్యూర్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు.  

మంగళవారం గోదావరిఖని  ప్రెస్ క్లబ్‌‌‌‌‌‌‌‌లో  వారు మీడియాతో మాట్లాడారు. కొయ్యూర్ ఉపసర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యురాలు లక్ష్మి తిరుపతి, మాజీ కోఆప్షన్ సభ్యుడు కలీమ్ ఖాన్‌‌‌‌‌‌‌‌లను ఎందుకు  సస్పెండ్ చేశారో మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌ బాబు చెప్పాలని, సొంత పార్టీ  కార్యకర్తలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాలేమిటో వివరించాలన్నారు. 

దళిత సామాజికవర్గానికి చెందిన ఎంపీ కావడంవల్లనే వంశీకృష్ణను చులకనగా చూస్తున్నట్టు అనుమానం ఉందన్నారు. చర్యలు తీసుకున్న లీడర్లపై  సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ ఎత్తివేయాలని, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ కల్పించాలని   డిమాండ్ చేశారు.