సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు డిజిటల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ క్యాంపులు ప్రారంభం

సింగరేణి రిటైర్డు ఉద్యోగులకు  డిజిటల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ క్యాంపులు ప్రారంభం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డు ఉద్యోగులు, పెన్షనర్లు సులభంగా డిజిటల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లు సమర్పించేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సీఎంపీఎఫ్‌‌‌‌‌‌‌‌ గోదావరిఖని రీజినల్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ కాంతేపూడి తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి సీఈఆర్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో డిజిటల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ క్యాంపును ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గోవర్ధన్​మాట్లాడుతూ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్ల సమర్పణ సమయంలో సీఎంపీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్​ నుంచి ఎలాంటి ఓటీపీ మెసేజ్‌‌‌‌‌‌‌‌లు, వాయిస్‌‌‌‌‌‌‌‌ కాల్స్‌‌‌‌‌‌‌‌ రావని స్పష్టం చేశారు. పెన్షనర్లు సైబర్‌‌‌‌‌‌‌‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఎల్‌‌‌‌‌‌‌‌సీ కోసం సీఎంపీఎఫ్‌‌‌‌‌‌‌‌ సూచించిన పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని, సర్టిఫికెట్లు సమర్పించి పెన్షన్‌‌‌‌‌‌‌‌ సదుపాయాన్ని పునరుద్ధరించుకోవాలని కోరారు. 

రెండు రోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపులో మొదటి రోజు 185 డిజిటల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లను రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ చేశారు. సీఎంపీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్, మందమర్రి ఏరియా సింగరేణి ఏటీబీ సెల్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది సేవలందించారు. కార్యక్రమంలో సింగరేణి డీజీఎం పర్సనల్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌, డీవైపీఎం రావికంటి సత్యనారాయణ, గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు.