దత్తత వివాదం: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాం: కలెక్టర్

దత్తత వివాదం: బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాం: కలెక్టర్

జగిత్యాల జిల్లా దత్తత వివాదానికి తెరపడింది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ఎట్టకేలకు అధికారులు ముందుకు వచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ బాలుడిని తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వడం లేదని అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న క్రమంలో.. కలెక్టర్ బి. సత్య ప్రసాద్ స్పందించారు. సీడబ్ల్యూసీ అనుమతి, పరిపాలనాపరమైన కారణాలతో అప్పగింతలో జాప్యం జరిగినట్లు చెప్పారు. 

2026 నవంబర్ 02 రాత్రి  లేదా మరుసటి రోజు ఉదయం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు.  బాలుడిని పెంచుకుంటున్న తల్లిదండ్రులు  న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, గౌరవ హైకోర్టు జారీ చేసిన ఇంటరిమ్ రిలీఫ్ ఉత్తర్వుల మేరకు బాలుడిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

బాలుడిని పెంచుకుంటున్న మహిళ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం, తమకు సంతానం లేకపోవడంతో హిందూ సంప్రదాయం ప్రకారం బాలుడిని దత్తత తీసుకుని గత మూడేళ్లుగా పెంచుకుంటున్నామని, అయితే ఈ వ్యవహారంపై వచ్చిన వార్తల నేపథ్యంలో అధికారులు బాలుడిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారని ఆమె పేర్కొన్నట్లు కలెక్టర్ తెలిపారు.