ఎల్ నినో కరువు పరిస్థితులల్లో అక్రమంగా బోర్లు వేసి నీటితో వ్యాపారం చేస్తున్న వారిపై హైడ్రా చర్యలు ప్రారంభించింది. తెల్లాపూర్‌లో అక్రమ బోర్లపై హైడ్రా చర్యలు తీసుకుంది. అనుమతులు లేకుండా నీటిని తోడేస్తున్న వారిపై హైడ్రా కొరడా ఝుళిపించింది.
2026 నవంబర్ 2న తెల్లాపూర్‌లో రెండు ప్రాంతాల్లో 7 అక్రమ బోర్లను తొలగించింది. పైపులతో సహా బోర్లను తొలగించి పూడ్చివేసింది. అదే విధంగా 6 వాటర్ సంపులను ధ్వంసం చేశారు అధికారులు. వాటర్ ట్యాంకులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
భూగర్భ జలాలను అక్రమంగా తోడేసి వ్యాపారం చేస్తున్న వారిపై గత కొంత కాలంగా నిఘా పెట్టిన హైడ్రా.. అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వ స్తోంది. అక్రమ నీటి దందాతో స్థానికులకు నీటి కొరత ఏర్పడుతున్న క్రమంలో యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది.
►ALSO READ | ఫాక్స్ సాగర్ FTL పరిధిలో హైడ్రా కూల్చివేతలు..మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు
మరోవైపు వాటర్ ట్యాంకర్ల ర్యాష్ డ్రైవింగ్‌తో స్థానికుల ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వస్తున్న ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటోంది. అక్రమ నీటి దందా కారణంగానే.. ట్యాంకర్ల ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువైందని భావిస్తున్నారు. అదేసమయంలో చెరువులు, కుంటల పరిధిలో అక్రమ నీటి దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
