హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా 2026 క్రీడా పోటీల ఏర్పాట్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో జరిగిన ఈ సమావేశంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న క్రీడా పోటీలకు సంబంధించి ఏర్పాట్లు, ప్రణాళిక, ఇప్పటివరకు జరిగిన పురోగతిపై అధికారులతో చర్చించారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మంది యువ క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొననున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. క్రీడాకారులకు అవసరమైన వసతి, రవాణా, మౌలిక సదుపాయాలు, పోటీల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను సమీక్షించారు.ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి హాజరయ్యారు.
అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.తెలంగాణలో జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి శాఖల మధ్య సమన్వయం, ఏర్పాట్ల పురోగతిపై ఈ సమీక్షలో చర్చించారు.
►ALSO READ | ఫాక్స్ సాగర్ FTL పరిధిలో హైడ్రా కూల్చివేతలు..మల్లారెడ్డి ఫామ్‌హౌస్ ప్రహరీ, గేటు తొలగింపు
