ఉదయం 5 గంటలకు ఎందుకు లేవాలి?: సర్ఫరాజ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్

 ఉదయం 5 గంటలకు ఎందుకు లేవాలి?: సర్ఫరాజ్ ఇన్స్పైరింగ్ వర్డ్స్

ఎంత తోడుకున్నా తరగని ట్యాలెంటున్న ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. కానీ అవకాశాలు మాత్రం కళ్లకు దగ్గరగా.. నోటికి దూరంగా ఉన్న లడ్డూలాగ ఊరిస్తూ ఉంటాయి. వచ్చినట్లే వచ్చి జారిపోతుంటాయి.  భారత టెస్ట్ జట్టు కు మళ్లీ మళ్లీ దూరం ఉండటంపై ఈ ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మనసులోని మాటలు బయటపెట్టారు. 

ఇటీవల ఇండియా ఏ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాకపోవడంతో మరోసారి విస్మరణకు గురైనట్లు చెప్పారు. అవకాశాలు దోబూచులాడుతుంటే.. విసుగు చెందటంకంటే ఇంకా కసిగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. మీకు ఎక్కడి నుంచి ఈ ప్రేరణ దొరుకుతుంది.. ఆశను చంపుకోకుండా ఎలా ముందుకు సాగుతున్నారు.? అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం ఎందరికో ఆదర్శంగా మారనుందనే చెప్పాలి.

 ప్రతి ఉదయం నేను నన్ను నేను అడుగుకుంటాను. ఎందుకు ఎక్కువ కష్టపడాలి? ఎందుకు మళ్లీ మళ్లీ రోజు చేసే పనులు చేయాలి? ఉదయం 5 గంటలకు ఎందుకు లేవాలి? అని అడుగుకుంటాను. నేను ఇప్పటికే భారత్ తరఫున ఆడాను. కష్టపడక పోయినా  ముంబై తరఫున ఆడగలను, 50లు, 100లు చేయగలను. కానీ నా నాన్న (నౌషాద్)  కోసం పర్ఫామ్ చేయాలనిపిస్తుంది. అదే నన్ను ప్రేరేపిస్తోంది అని చెప్పుకొచ్చారు.

2024లో న్యూజిలాండ్ భారత్‌లో పర్యటించినప్పుడు చివరిసారి జాతీయ జట్టు తరఫున ఆడిన సర్ఫరాజ్, ఆస్ట్రేలియా పర్యటనలోనూ స్క్వాడ్‌లో ఉన్నా అవకాశం దక్కలేదు. నేను క్రికెట్ కోసమే పుట్టాను. ఇంట్లో కూర్చోవడం నాకు నచ్చదు. రంజీ, ముష్తాక్ అలీ, విజయ్ హజారే, ఐపీఎల్ లేదా భారత జట్టు పిలిస్తే... ఎక్కడైనా ఆడాలని ఉంది అని అన్నారు.

సెలెక్టర్లు తనను ఇండియా పరిస్థితులకే పరిగణిస్తున్నారనే అభిప్రాయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లో కూడా సెంచరీలు చేశాను. భారత్‌లో పెద్ద టర్నర్లపై ఆడటం కష్టం అని చెప్పారు.

ఆఫ్-సీజన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి 22 కిలోలు తగ్గి ఇప్పుడు 77 కిలోల బరువుకు వచ్చాను. గతంలో 97 కిలోలు ఉండేవారు. నేను కొవ్వు ఉన్నప్పుడు మరింత బాగా ఆడేవాడిని  అని హాస్యంగా అన్నారు.

ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 66 మ్యాచ్‌ల్లో 5 వేల 354 పరుగులు, 18 సెంచరీలు చేసి సగటు 63.73 ఉన్న సర్ఫరాజ్, తనకుతన  తండ్రి మద్దతు మాత్రమే ఉందని చెప్పారు. నాన్న కలను నేను నెరవేర్చాను. ఒకటి రెండు సార్లు కాదు... 300, 250, 200లు చేసి కష్టపడి టీమ్ లో అవకాశం సంపాదించాను అన్నారు.